భారత వైమానిక దళంలోని సాంకేతిక, సాంకేతికేతర విభాగాల్లోని ఉద్యోగాల వైపు యువత ఆకర్షితులయ్యేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో సీఎస్ సోమేష్ కుమార్ను భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శ్రీరాం, వింగ్ కమాండర్ యోగేశ్ మొహ్లా కలిశారు.
వైమానిక దళంలో రాష్ట్ర యువత ఉద్యోగాల విషయమై సమావేశంలో చర్చించారు. భారత వైమానిక దళంలో తెలంగాణ ఉద్యోగులు కేవలం 0.8శాతం మాత్రమే ఉన్నారని సీఎస్ తెలిపారు. రక్షణ దళాలు అందించే ఉద్యోగాకాశాల గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.