తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ పరీక్షలు పెంచాలి: దాసోజు శ్రవణ్​ - కొవిడ్​ పరీక్షలు పెంచాలన్న దాసోజు శ్రవణ్​

కొవిడ్ పరీక్షల పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు నిలువుదోపిడీ దోస్తున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై చొరవచూపి కట్టడి చేయాలని డిమాండ్‌ చేశారు.

congress leader, aicc
Dasoju Shravan, aicc spoke person

By

Published : Mar 25, 2021, 8:34 PM IST

తెలంగాణలో కొవిడ్​ కేసులు క్రమంగా పెరుగుతున్నందున పరీక్షల సంఖ్య పెంచాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. వాటిపై పర్యవేక్షణ చేయాలని కోరారు.

కొవిడ్​ పరీక్షకోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో క్షేత్రస్థాయిలో అమలవడం లేదన్నారు. ప్రైవేటు ల్యాబ్​లకు వెళ్లినా... ఇంటికొచ్చి శాంపిల్​ తీసినా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మూసీ ప్రక్షాళనపై ప్రధానికి ఎంపీ కోమటిరెడ్డి లేఖ

ABOUT THE AUTHOR

...view details