తెలంగాణ

telangana

ETV Bharat / state

'బడ్జెట్‌లో మూడో వంతు వ్యవసాయ రంగానికే కేటాయిస్తున్నాం' - assembly

ఖరీఫ్‌లో కోటి ఎకరాలకు పైబడి పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. వ్యవసాయశాఖ పద్దుపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.

assembly

By

Published : Sep 18, 2019, 8:04 PM IST

వ్యవసాయరంగంలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఖరీఫ్‌లో కోటి ఎకరాలకు పైబడి పంటలు సాగయ్యాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో వ్యవసాయానికి బడ్జెట్‌లో 16 శాతమే కేటాయింపు చేస్తే...మన రాష్ట్రంలో మాత్రం మొత్తం బడ్జెట్‌లో మూడో వంతు వ్యవసాయ రంగానికే కేటాయిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

'బడ్జెట్‌లో మూడో వంతు వ్యవసాయ రంగానికే కేటాయిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details