తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ ఎగుమతులపై రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ - ias parthasarathi

వ్యవసాయ ఎగుమతుల విధానం అమలు కోసం రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ ఆదేశాలకు అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

agri exports policy in telangana
వ్యవసాయ ఎగుమతులపై రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ

By

Published : Nov 29, 2019, 10:22 PM IST

వ్యవసాయ ఎగుమతుల విధానం అమలు కోసం రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్‌ అధ్యక్షతన సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులతో కమిటీని రూపొందించారు. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి కమిటీకి కోఛైర్మన్ గా వ్యవహరిస్తారు. నోడల్ అధికారులుగా జిల్లా కలెక్టర్లు వ్యవహరిస్తారు. వ్యవసాయ ఎగుమతుల విధానం కింద గుర్తించిన పంట క్లస్టర్లను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • మామిడి- నాగర్‌కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, రంగారెడ్డి, సంగారెడ్డి
  • మిరప- భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి
  • పసుపు- నిజామాబాద్, నిర్మల్
  • మామిడి, పసుపు - జగిత్యాల
  • మామిడి, మిరప– ఖమ్మం
  • మామిడి, పసుపు, మిరప- మహబూబాబాద్

ABOUT THE AUTHOR

...view details