జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని పంజాగుట్ట అగర్వాల్స్ ఐ ఆస్పత్రి వారు నిర్వహించిన నేత్రదాన అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆస్పత్రి ప్రతినిధులతోపాటు... విద్యార్థులు భారీగా పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు. ఏటా వేలాది మంది కార్నియా సమస్యతో అంధులు అవుతున్నారని అగర్వాల్స్ ఆస్పత్రి రీజనల్ హెడ్ డాక్టర్ వంశీధర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు నేత్రదాతలుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంజాగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
"ప్రతి ఒక్కరూ నేత్రదాతలుగా మారాలి" - Agarwals
ప్రతి ఒక్కరు నేత్రదాతలుగా మారాలని అగర్వాల్స్ ఆస్పత్రి రీజనల్ హెడ్ డాక్టర్ వంశీధర్ అన్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు.
eye