తెలంగాణ

telangana

ETV Bharat / state

'భాగ్యనగరంలో ప్రపంచ స్థాయి ఎరోస్పేస్​ యూనివర్సిటీ' - తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

కరోనా భయంతో వింగ్స్​ ఇండియా-2020 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నా... పౌర విమానయాన శాఖ, ఫిక్కీ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎయిర్​ షో సాధ్యమైందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్​లో జరుగుతోన్న వింగ్స్​ ఇండియా ఎయిర్​ షో ఆసియాలోనే అతి పెద్దదని వ్యాఖ్యానించారు.

aerospace university in hyderabad
భాగ్యనగరంలో ప్రపంచ స్థాయి ఎరోస్పేస్​ యూనివర్సిటీ

By

Published : Mar 13, 2020, 12:52 PM IST

Updated : Mar 13, 2020, 2:11 PM IST

తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రానికి ఏవియేషన్, ఎరో స్పేస్​లు ప్రాధాన్య రంగాలని మంత్రి కేటీఆర్​ అన్నారు. నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్‌ ఇండియా-2020 ప్రదర్శనకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్​లో ప్రపంచ స్థాయి ఎరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు.

భాగ్యనగరంలో ప్రపంచ స్థాయి ఎరోస్పేస్​ యూనివర్సిటీ

" రాష్ట్రంలో 3 గ్రీన్​ఫీల్డ్​ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదనలు అందించాం. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లో గ్రీన్​ఫీల్డ్​ విమానాశ్రయాలకు అవకాశాలున్నాయి. వరంగల్​ విమానాశ్రయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చి, కనెక్టివిటీ స్కీం, ఉటాన్​ స్కీంతో అనుసంధానించేందుకు యోచిస్తున్నాం"

-మంత్రి కేటీఆర్

Last Updated : Mar 13, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details