ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని సినీ తార కాజల్ అగర్వాల్ అన్నారు. మాదాపూర్‌లోని వెస్ట్రన్ హోటల్‌లో సేఫ్‌జోన్ హెల్త్ బ్యాండ్‌ను ఆమె మార్కెట్‌లోకి విడుదల చేశారు.
KAJAL: స్వీయ నియంత్రణే కరోనా కట్టడికి మార్గం: కాజల్ అగర్వాల్
స్వీయ నియంత్రణతోనే కొవిడ్‌ను అరిగట్టగలమని సినీనటి కాజల్ అగర్వాల్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని వెస్ట్రన్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సేఫ్‌జోన్ హెల్త్ బ్యాండ్‌ను ఆమె ఆవిష్కరించారు.
kajal
కరోనా సంక్షోభ సమయంలో ఇలాంటి సేఫ్టీ డివైజ్‌లు ఎంతో ఉపయోగపడుతాయని సంస్థ ఇండియా డైరెక్టర్ రష్మీ ఠాకూర్ తెలిపారు. కరోనా లక్షణాలను ముందుగా అలర్ట్ చేసేలా సేఫ్ జోన్ హెల్త్ బ్యాండ్ డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాజల్‌తోపాటు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, సేఫ్ జోన్ హెల్త్ బ్యాండ్ ఇండియా డైరెక్టర్ రష్మీ ఠాకూర్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.