ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నేతలు చేసే ప్రసంగాలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు ఎస్ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు నేతలు నిందాపూర్వక ప్రసంగాలు చేస్తున్నారని, కొందరు వ్యక్తిగత జీవితాలను కూడా విమర్శిస్తున్నారని కమిషన్ పేర్కొంది.
ప్రసంగాలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది: ఎస్ఈసీ
శాంతి- భద్రతల సమస్యలు తలెత్తేలా ప్రసంగాలు చేయవద్దని రాజకీయ పార్టీలు, నేతలకు రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నేతలు చేసే ప్రసంగాలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపింది.
ప్రసంగాలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది: ఎస్ఈసీ
ఎలాంటి అధారాలు లేకుండా విమర్శలు చేస్తున్నారని... అలాంటి ప్రసంగాలకు ప్రతిస్పందనలు రావడం వల్ల ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ఎస్ఈసీ తెలిపింది. వీటన్నింటి నేపథ్యంలో రాజకీయ ఉద్రేకాలతో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా, సాఫీగా, సజావుగా ఎన్నికలు జరగని పరిస్థితులు వచ్చేలా, శాంతి- భద్రతల సమస్యలు తలెత్తేలా ప్రసంగాలు చేయవద్దని రాజకీయ పార్టీలు, నేతలకు రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది.