సికింద్రాబాద్లోని జవహర్ నగర్లో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక యువకుడు ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనక కూర్చున్న మహిళా ఎగిరి కిందపడి మృతి చెందింది. మృతురాలు బంధువులను కలిసి వస్తుండగా అంబేడ్కర్ నగర్ ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న కారుని తప్పించే క్రమంలో ప్రాణాల్ని కోల్పోయింది. వాహనంపై ఉన్న ఆమె కుమారుడికి, యువకుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి - వివాహిత
సికింద్రాబాద్లోని జవహర్ నగర్లో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వివాహిత ప్రమాదవశాత్తు మరణించింది. వాహనదారుడు ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనక కూర్చున్న మహిళా ఎగిరిపడి మృతి చెందింది.
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి