శోకం మిగిల్చిన పెళ్లి షాపింగ్... హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా... 12 మందికి గాయాలయ్యాయి. కుషాయిగూడకు చెందిన మధు తన మేనకోడలి పెళ్లి షాపింగ్ కోసం మారుతి వ్యాన్‌లో వెళ్లారు. రామ్‌నగర్‌లో షాపింగ్ పూర్తి చేసుకుని బేగంబజార్‌కు నల్లకుంట మీదుగా వెళ్తుండగా... ఫీవర్ ఆస్పత్రి వద్ద డివైడర్ని ఢీకొని ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో నాలుగేళ్ల శ్రీఆన్స్ మృతి చెందగా... డ్రైవర్ సహా మిగతావాళ్లంతా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.