హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి కూరగాయల లోడుతో వస్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న దేవాలయాన్ని ఢీకొట్టింది. ఆలయం చుట్టు ఉన్న ఇనుప చువ్వలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
లంగర్‌హౌస్‌లో రోడ్డు ప్రమాదం - latest road accidents in hyderabad
ఓ ఆటో అదుపుతప్పి దేవాలయాన్ని ఢీకొన్న ఘటన హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో జరిగింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
![లంగర్‌హౌస్‌లో రోడ్డు ప్రమాదం accident in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6904810-thumbnail-3x2-acci.jpg)
లంగర్‌హౌస్‌లో రోడ్డు ప్రమాదం