ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం రన్‌వేపై త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌కు ముందు రన్‌వే పరిశీలనకు వెళ్లిన ఫైరింజిన్ బోల్తా పడింది. అదే సమయంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న బెంగళూరు - తిరుపతి విమానం ఫైలట్... రన్‌వే పై ఉన్న ఫైరింజిన్‌ను గుర్తించాడు. సమాచారాన్ని కంట్రోల్ రూమ్ అధికారులకు తెలపగా... వెంటనే రన్‌వేపై నుంచి తొలగించడం కష్టమని వివరించారు. దీంతో బెంగళూరు నుంచి వచ్చిన విమానాన్ని రన్‌వైపై ల్యాండ్ చేయకుండా తిరిగి పంపించేశారు. రన్‌వేపై ఉన్న ఫైరింజిన్ తొలగింపు పనులు చేపట్టిన అధికారులు... వస్తున్న విమానాలను ల్యాండింగ్ చేయకుండా వెనక్కి పంపించేస్తున్నారు.
రేణిగుంట విమానాశ్రయంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం - ఎయిర్పోర్ట్ రన్‌వేపై తప్పిన ప్రమాదం వార్తలు
ఏపీ చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ విమానం ల్యాండింగ్ పరిశీలనకు వచ్చిన ఫైరింజన్ బోల్తా పడింది. మరో ఫ్లైట్ రన్‌వేపై ల్యాండ్ అవ్వడానికి సమీపంగా వచ్చింది. అంతలో ఏం జరిగిందంటే...
రేణిగుంట విమానాశ్రయంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం