జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్య ఇంట్లో అనిశా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లల్లోనూ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై సుధీర్ రెడ్డి ద్వారా సీఐ బలవంతయ్య 50వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య ఇంట్లో అనిశా సోదాలు - acb rides in CI balavanthaiah home today news
12:29 January 11
ఇన్స్పెక్టర్ బలవంతయ్య ఇంట్లో అనిశా సోదాలు
జూబ్లీహిల్స్ ఎస్సై సుధీర్ రెడ్డిని అనిశా అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సీఐ బలవంతయ్య ఆదేశాల మేరకు లంచం తీసుకున్నట్లు సుధీర్ రెడ్డి అనిశా అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. సీఐపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
బలవంతయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో అనిశా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ సీఐగా రెండు నెలల క్రితం చేరిన బలవంతయ్య..... పలు కేసుల్లో డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా స్టేషన్ పరిధిలోని హోటళ్లు, పబ్బులు, ఇతర వ్యాపార సంస్థల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో అనిశా అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇవీ చూడండి:ఏసీబీ అధికారులకు లొంగిపోయిన జూబ్లీహిల్స్ సీఐ