ఆంధ్రప్రదేశ్‌లో ఈఎస్ఐ కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి పితాని ప్రమేయంపై అనిశా అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. పితాని సత్యనారాయణ, మాజీ పీఎస్ మురళీ మోహన్ని సచివాలయంలో అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన హయాంలోనూ అక్రమాలు కొనసాగినట్లు ఆరోపణలు రావడం వల్ల వాటిపై విచారిస్తున్నారు.
అనిశా అదుపులో ఏపీ మాజీ మంత్రి పితాని, మాజీ పీఎస్ - pithani satyanarayana on esi scam
ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ పీఎస్ మురళీ మోహన్‌ను అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు.
ఈఎస్ఐ కేసు: అనిశా అధికారుల అదుపులో ఏపీ మాజీ మంత్రి పితాని, మాజీ పీఎస్
పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్‌తో పాటు మురళి కూడా ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇది హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. శని, ఆదివారాలు న్యాయస్థానం సెలవు ఉంటుంది. ఈ పరిస్ధితుల్లో ముందుగానే మురళిని అనిశా అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతని అరెస్టును అనిశా అధికారులు కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
ఇదీ చూడండి :'సచివాలయం కూల్చివేత నిర్ణయం సరైంది కాదు'