కూకట్‌పల్లిలో జేఎన్టీయూ పరిపాలన విభాగం కార్యాలయం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. న్యాక్ గుర్తింపు కోసం తప్పుడు పత్రాలను సృష్టించిన మంత్రి మల్లారెడ్డిపై, ఆయన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఎన్టీయూ అనుబంధంగా ఉన్న... మంత్రి చెందిన కళాశాలల గుర్తింపు పత్రాలను పునః పరిశీలించాలన్నారు. మంత్రి మల్లారెడ్డిని పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
'మల్లారెడ్డిపై, ఆయన కళాశాలలపై చర్యలు తీసుకోవాలి' - మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ధర్నా
మంత్రి మల్లారెడ్డిపై, ఆయన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు జేఎన్టీయూ వద్ద ఆందోళనకు దిగారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆయనను పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
'మల్లారెడ్డిపై, ఆయన కళాశాలలపై చర్యలు తీసుకోవాలి'
అనంతరం యూనివర్శిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్‌కు వినతి పత్రం అందజేశారు. మంత్రి కళాశాలలపై కమిటీ ఏర్పాటు చేసి.. విచారణ జరుపుతామని రిజిస్ట్రార్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి:'మంత్రి మల్లారెడ్డిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి'