చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్ బిజాపూర్ రహదారిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై ధర్నా చేశారు. ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేయడం తగదని ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పెండింగ్లో ఉన్న 2486 కోట్ల రీయింబర్స్మెంట్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం, ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. ఇప్పుడు విద్యార్థుల రీయింబర్స్మెంట్ కూడా చెల్లించక పోవడం దారుణమని పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి:ఏబీవీపీ
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను వెంటనే విడుదల చేయాలి:ఏబీవీపీ