జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని హబ్సిగూడలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఏబీవీపీ ఏర్పడి 70 వసంతాలు పూర్తి చేసుకొని 71వ వసంతంలోకి అడుగుపెట్టిందని ఏబీవీపీ హబ్సిగూడ జోనల్ ఇంచార్జ్ వెంకటేష్ చారి తెలిపారు. స్థాపించిన నాటి నుండి నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడుతుందని చారి పేర్కొన్నారు.
71వ వసంతంలోకి అడుగు పెట్టిన ఏబీవీపీ
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఏబీవీపీ 71వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
71వ వసంతంలోకి ఏబీవీపీ...