తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ - ఏబీవీపీ

ఇంజినీరింగ్ ఫీజులు తగ్గించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రైవేట్ ఇంజినీరింగ్​ కళాశాలల ఫీజును నియంత్రించాలని విద్యార్థి నేతలు డిమాండ్​ చేశారు.

Higher Education Council

By

Published : Jul 2, 2019, 4:19 PM IST

ఇంజినీరింగ్ ఫీజులు తగ్గించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన గేటును తోసుకొని లోపటికి చొచ్చుకుపోయిన విద్యార్థి సంఘ కార్యకర్తలు... రాష్ట్ర ఫీజు నియంత్రణ మండలి ఛైర్మన్ చాంబర్​లో బైఠాయించారు. ప్రైవేట్ కళాశాలలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ఇష్టారీతిన ఫీజు పెంచుకోవడం వల్ల... ఆయా కళాశాలల్లో సామాన్య విద్యార్థులు చదివే పరిస్థితి లేదని.... ఏబీవీపీ కార్యకర్తలు ఎఫ్ఆర్​సీ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రైవేట్ కళాశాలల ఫీజును నియంత్రించాలని ఏబీవీపీ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ

ABOUT THE AUTHOR

...view details