తెలంగాణ

telangana

ETV Bharat / state

'నోటుకు ఓటు అమ్ముకుంటే అంతే సంగతులు'

రాజకీయాలు వ్యాపారంగా మారాయని.. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆర్​.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలు సంఘటితంగా పోరాడి నియంతృత్వాన్ని అణచివేయాలని కోరారు. ప్రజల భవిష్యత్తంతా ఓటులోనే ఉందని...అలాంటి నిర్ణయాత్మక శక్తిని అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు.

'నోటుకు ఓటు అమ్ముకుంటే అంతే సంగతులు'

By

Published : Apr 4, 2019, 5:48 PM IST

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు పారిశ్రామిక వ్యక్తులు, రియల్టర్ల చేతిలోకి వెళ్లాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని బషీర్​ బాగ్ ప్రెస్​ క్లబ్​లో బడుగుల అభ్యున్నతికై పోరాటం అనే అంశంపై సదస్సు జరిగింది. పౌర సమాజం, మేధావి వర్గం, సంఘ సంస్కర్తలు రాజకీయ సంస్కరణలపై శ్రద్ధ చూపాలని కోరారు. లేకుంటే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాలు సంఘటితంగా పోరాటం చేయాలని సూచించారు. ​

'నోటుకు ఓటు అమ్ముకుంటే అంతే సంగతులు'

ABOUT THE AUTHOR

...view details