Daughter in Law sexually abused by Her uncle: తండ్రి తర్వాత తండ్రిలా చూసుకోవాల్సిన మామ... లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. కొడుకు భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తన మామపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదు చేసింది. గోల్కొండ రిసాలబజార్కు చెందిన ఖలిక్ హైమద్.. తన కుమారుడికి బంధువుల అమ్మాయిని ఇచ్చి 2020లో వివాహం చేశాడు.
వివాహం అయినప్పటి నుంచి తనపై మనసు తనపై మనసు పడ్డ మామ తరచుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం ఎవరికి చెప్పినా చంపుతానని వేధిస్తున్నాడని తన భర్తకు తెలిపి స్థానికంగా ఉన్న గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసినా తన మామపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. తన ఇద్దరు కూతుర్లను, తన భర్తను తరచుగా వేధిస్తూ.. చంపుతానని బెదిరిస్తున్న మామ నుంచి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని బాధిత మహిళ వేడుకుంది.