ఎప్పటిలాగే దొంగతనం చేసి తప్పించుకుందామని అనుకున్నాడా దొంగ. కాని విధి వక్రించింది. ఓ పాడుపడిన బావి ఆ దొంగను పోలీసులకు పట్టించింది. ఎవరా దొంగా, ఏంటా పాతబావి..అనుకుంటున్నారా..! వివరాల్లోకి వెళ్తే, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం కొప్పలపేటలో మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు కోళ్లు దొంగిలించారు. కోళ్ల అరుపులతో ఓ దొంగ గ్రామస్తులకు చిక్కాడు. మరొకతను పారిపోతూ, కంగారులో పొలాల్లోని పాతబావిలో పడిపోయాడు. ఆ బావిలో నీరు లేకపోవడంతో ఆ దొంగ నడుము విరిగింది. పైకి వచ్చే శక్తిలేక మూలుగుతూ మూడు రోజులు బావిలోనే ఉండిపోయాడు. బావి వైపు వెళ్తోన్న స్థానికులకు ఇవాళ చప్పుడు వినిపించడంతో, వారు పోలీసులకు సమాచారమందించారు. దీంతో అసలు సంగతి బయటపడింది. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి తప్పించుకున్న కోళ్ల దొంగ ఇతనే అని నిర్ధరించారు. నడుము విరిగిన దొంగ దీనావస్థను చూసి గ్రామస్థులు అయ్యో పాపం అనుకుంటున్నారు. బావిలో పడిన వ్యక్తి విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పురేయవలసకు చెందిన ఆదినారాయణగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
దొంగతనానికి పోయి పాతబావిలో పడ్డ దొంగ - crime news
దొరకనంత వరకు దొరే..దొరికితేనే దొంగ అన్న సామెతను చోర కళాకారులు పక్కగా ఫాలో అవుతారనేది లోకం మాట. సరిగ్గా అలాంటి మార్గంలోనే వెళ్లారు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు దొంగలు. కానీ, అనుకోకుండా ఓ రోజు కథ అడ్డం తిరిగింది. కోళ్ల దొంగతనానికి వెళ్లి, బావిలో పడ్డాడో దొంగ. నడుము విరిగి మూలుగుతున్న ఆ దొంగను చూసి, గ్రామస్థులు అయ్యో పాపం అనుకుంటున్నారు. అందుకే అన్ని రోజులు ఓకేలా ఉండవ్ అంటారు..!
బావిలో దొంగ