రాష్ట్రంలో సభ్యత్వ నమోదుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగడానికి భాజపా సన్నద్ధమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ సభ్యత్వ నమోదుకు తనదైన శైలిలో ముందుకు సాగడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందుకు ముషీరాబాద్ నియోజకవర్గ భాజపా నాయకుడు పూస రాజు పార్టీ సభ్యత్వ ప్రచార రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. రాంనగర్లో జరిగిన సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ ప్రచార రథంపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు.
భాజపా సభ్యత్వ నమోదుకు ప్రచార రథం
భాజపా సభ్యత్వ నమోదు ప్రచారానికి ప్రత్యేక రథంను తయారు చేయించారు. ఆ రథంపై రాష్ట్ర వ్యాప్తంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సభ్యత్వ నమోదు కోసం పర్యటించనున్నారు.
భాజపా సభ్యత్వ నమోదుకు ప్రచార రథం