హైదరాబాద్‌లోని మౌలాలీకి చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి చాతిలో నొప్పిగా ఉందని కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తాలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. రాంప్రసాద్‌కు వాల్బ్లాక్ అయిందని వెంటనే చికిత్స చేయాలని తెలిపారు. ఆపరేషన్ థియోటర్లోకి తీసుకెళ్లిన వైద్యులు, ఐదు నిమిషాల్లోనే రాంప్రసాద్ మృతి చెందారని చెప్పారు. ఆసుపత్రి యాజమాన్యం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాంప్రసాద్ మృతి చెందాడని ఆరోపిస్తూ... అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి - a man suspected death in ecil hyderabad
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని కాప్రా సర్కిల్లో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయడంటూ మృతుడి బంధువులు ఆస్పత్రి ముందు ధర్నా చేశారు.
ఆందోళ చేస్తున్న కుటుంబ సభ్యులు
TAGGED:
వ్యక్తి అనుమానాస్పద మృతి