రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులో కాల్పులు ఘటన సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్ నుంచి మణికొండకు వెళ్తున్న కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సులో బంజారాహిల్స్ వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రయాణికుల మధ్య వాగ్వాదం దీనికి కారణంగా తెలుస్తుంది. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పుల అనంతరం కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డిపోకు చేరుకున్న బస్సును ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ పరిశీలించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్న ఆర్టీసీ ఈడీతో మా ప్రతినిధి ముఖాముఖి...
'బస్సులో కాల్పుల ఘటనపై పూర్తి విచారణ జరుపుతాం' - బస్సులో కాల్పులు
బంజారాహిల్స్‌లో కంటోన్మెంట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పుల అనంతరం డిపోకు చేరిన బస్సును ఆర్టీసీ ఈడీ వినోద్‌కుమార్ పరిశీలించారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ ఈడీ