తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రీన్​ ఛానల్​ ద్వారా హృదయం తరలింపు

29 కిలోమీటర్లు... 22 నిమిషాలు... ​ హైదరాబాద్​ లక్డీకాపూల్​లోని గ్లోబల్​ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకుంది. అందులో ఉన్నది పేషెంట్​లు కాదు... ఓ హృదయం. అత్యవసరంగా చెన్నై తీసుకెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్​, సైబరాబాద్​ పోలీసుల సహకారంతో గ్రీన్​ ఛానల్​ ఏర్పాటు చేసి దిగ్విజయంగా ఓ గుండెను గమ్యానికి చేర్చారు.

హృదయం తరలింపు

By

Published : Jun 26, 2019, 11:52 PM IST

హైదరాబాద్‌ నుంచి చెన్నైకి హృదయాన్ని తరలించేందుకు పోలీసులు చేపట్టిన చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్​, సైబరాబాద్​ పోలీసులు లక్డీకాపూల్​లోని గ్లోబల్​ ఆసుపత్రి నుంచి గుండెను శంషాబాద్​ రాజీవ్​గాంధీ విమానాశ్రయానికి తీసుకెళ్లేలా గ్రీన్​ ఛానల్​ ఏర్పాటు చేశారు. అంబులెన్స్​ ప్రయాణించే మార్గాల్లో పూర్తి అప్రమత్తతతో ట్రాఫిక్​ను నిలిపివేయడం వల్ల గుండె వేగంగా గమ్యాన్ని చేరుకుంది. 29 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 22 నిమిషాల్లోనే తరలించడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details