ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం టి.అగ్రహారానికి చెందిన శ్రీనివాసరావు... వ్యవసాయానికి కొత్త. సీఆర్పీఎఫ్లో 21 ఏళ్ల పాటు పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఉత్తర భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉద్యోగం చేసిన శ్రీనివాసరావు... గోధుముల సాగుపై ఓ అవగాహన తెచ్చుకున్నారు. కరోనా ప్రభావంతో... ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్న విషయాన్ని గ్రహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహా తీసుకొని నల్ల గోదుమలు సాగు చేశారు. వీటికి మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంటుందంటున్నారు శ్రీనివాసరావు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి...!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి...! శ్రమ తక్కువ... ఆదాయం ఎక్కువ. పంటకు మార్కెట్లో మంచి డిమాండ్...! వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ఇప్పుడీ మూడు సూత్రాలే కీలకం. వాటినే అనుసరించారు ప్రకాశం జిల్లా వాసి. ఉద్యోగం వదిలేసి.. సాగుబడిలోకి దిగారు. నల్ల గోధుమలు సాగు చేశారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి...!
మూడు నెలల క్రితం సాగుచేసిన నల్లగోధమ.. ఇప్పుడు కంకిదశకు వస్తోంది. సంప్రదాయ పంటల సాగుతో ఏటా నష్టపోతున్న రైతులు... శ్రీనివాసరావు పొలం వద్దకు వచ్చి... నల్లగోధుమల సాగు గురించి ఆరా తీస్తున్నారు. వ్యవసాయ అధికారుల సూచనలతో పాటు యూట్యూబ్‌లో చూసి ఎప్పటికప్పుడు పంట సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నారు శ్రీనివాసరావు. మరో 3నెలల్లో దిగుబడి వస్తుందని చెప్తున్నారు.
ఇదీ చదవండి:జీవనోపాధుల పెంపుతో గ్రామీణాభ్యుదయం