హైదరాబాద్ సనత్‌నగర్‌లో సహజీవనం చేస్తున్న ఓ జంట ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వీరిలో మహిళ మృతి చెందింది. లాల్‌బహదూర్ శాస్త్రీనగర్‌లో గత కొంతకాలంగా భూపాల్ అనే వ్యక్తి చైతన్య అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు కలిసి యాసిడ్ తాగి ఆత్మహత్యయత్నం చేశారు. చైతన్య మృతి చెందగా.. భూపాల్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సహజీవనం చేస్తోన్న జంట ఆత్మహత్యాయత్నం - సహజీవనం
సహజీవనం చేస్తున్న ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పరిధిలో చోటుచేసుకుంది.
సహజీవనం చేస్తోన్న జంట ఆత్మహత్యాయత్నం