తెలంగాణ

telangana

ETV Bharat / state

హరీశ్​రావుకు చిన్నారి అభినందనలు - finance minister

రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  హరీశ్​రావును ఓ చిన్నారి అభిమాని కలిసి అభినందలు తెలిపాడు. ఖమ్మం నుంచి వచ్చి తనను అభినందించిన బాల అభిమాని నిహాల్​ను మంత్రి శాలువాతో సత్కరించారు.

హరీశ్​రావుకు చిన్నారి అభినందనలు

By

Published : Sep 10, 2019, 9:34 PM IST

ఆర్థిక మంత్రి హరీశ్​రావుకు ఓ బాల అభిమాని అభినందనలు తెలిపాడు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్ రావు... నిహాల్ అనే బాలుడిని సాగునీటి ప్రాజెక్టులకు బుల్లి ప్రచారకర్తగా నియమించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తన అభిమాన నాయకుడు హరీశ్ రావును కలిసేందుకు నగరానికొచ్చాడు. కొంపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో హరీశ్​ రావుని కలిసి అభినందనలు తెలిపాడు. తనను గుర్తుపెట్టుకొని ఖమ్మం నుంచి వచ్చిన ఆ బాలుడిని శాలువాతో సత్కరించారు మంత్రి.

ABOUT THE AUTHOR

...view details