తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోడు సమస్య శాశ్వత పరిష్కారానికి సీఎం సాహసోపేత నిర్ణయం' - Podu land meeting in hyderabad

Podu Land Issue in Telangana: పోడు భూముల సమస్యను పరిష్కరించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలను అధికార యంత్రాగం కసరత్తు ముమ్మరం చేసింది. పోడు భూముల అంశంపై నిర్వహించిన కార్యశాలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​, అటవీశాఖ అధికారులు హాజరయ్యారు. పోడు సమస్య శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మేరకు అటవీ సంపద సంరక్షణకు సర్కారు చిత్తశుద్ధితో, ముందుకెళ్తోందని వివరించారు.

Podu land meeting in hyderabad
Podu land meeting in hyderabad

By

Published : Dec 2, 2022, 8:18 PM IST

'పోడు సమస్య శాశ్వత పరిష్కారానికి సీఎం సాహసోపేత నిర్ణయం'

Podu land meeting in hyderabad: రాష్ట్రంలో పోడు భూముల సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికార యంత్రాగం కసరత్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్‌లో పోడు భూముల అంశంపై నిర్వహించిన కార్యశాలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, అటవీశాఖ అధికారులు హాజరయ్యారు. పోడు భూముల అంశానికి సంబంధించి తదుపరి ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు.

పోడు సమస్య శాశ్వత పరిష్కారానికి సీఎం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న మంత్రి సత్యవతి.. అటవీ సంపద సంరక్షణకు సర్కారు చిత్తశుద్ధితో, ముందుకెళ్తోందని వివరించారు. అటవీహక్కుల చట్టం నిబంధనల ప్రకారం కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. చట్టానికి లోబడి పోడు సాగుదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపిన మంత్రి.. అడవుల నరికివేతకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ, రెవెన్యూ, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సత్యవతి రాథోడ్‌ దిశానిర్దేశం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details