తెలంగాణ

telangana

ETV Bharat / state

సమతుల ఆహారంతో 80 శాతం రోగాలను అరికట్టవచ్చు

హైదరాబాద్ బంజారాహిల్స్​లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో  ''ప్రతి ఇంటా పౌష్టకాహారం'' అనే నినాదంతో  ప్రత్యేక వంటల ప్రదర్శన నిర్వహించారు. సమతుల  ఆహారం తీసుకోవడం వల్ల 80శాతం జబ్బులను దరిచేరనీయకుండా చేయవచ్చని ఆసుపత్రి సీఈవో డా.ప్రభాకర్​రావు అన్నారు.

సమతుల ఆహారంతో 80 శాతం రోగాలను అరికట్టవచ్చు

By

Published : Sep 7, 2019, 1:06 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు జరిగాయి. ప్రతి ఇంటా పౌష్టికాహారం నినాదంతో ప్రత్యేక వంటల తయారీ ప్రదర్శన ఏర్పాటు చేసి రోగులకు అవగాహన కల్పించారు.సమతుల ఆహారంతో 80శాతం రోగాలను అరికట్టవచ్చని ఆసుపత్రి సీఈవో ప్రభాకార్​రావు అన్నారు. సమాజంలో వస్తున్న జీవన శైలిలో మార్పుల వల్ల పౌష్టిక ఆహారం అందడం లేదని..దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాబోయే వేయి రోజుల్లో అనీమియా నివారణ, డైయేరియా నియంత్రణ, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించననున్నట్లు ఆసుపత్రి డైటిక్స్‌ విభాగం నిపుణురాలు డాక్టర్‌ వసుంధర తెలిపారు.

సమతుల ఆహారంతో 80 శాతం రోగాలను అరికట్టవచ్చు

ABOUT THE AUTHOR

...view details