ఇప్పటివరకున్న తాజావార్తలుకాసేపట్లో పదో తరగతి పరీక్షలు.. పదో తరగతి పరీక్షలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు జరగని పదో తరగతి పరీక్షల కోసం 2,861 కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు రాయనున్నారు. ఆన్‌లైన్ షాపింగే బెస్ట్ అంటున్న హైదరాబాదీలుమొదట కొత్తదనం.. తర్వాత వ్యాపకం.. ఇప్పుడేమో పొదుపు.. నగరంలో ఆన్‌లైన్ ఆర్డర్లు ఇస్తున్న కొనుగోలుదారుల్లో వచ్చిన మార్పు ఇది. కొవిడ్ భయాలు తగ్గి బయట మార్కెట్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఖర్చు దృష్ట్యా ఇంటి నుంచి కాలు కదపకుండానే సకలం గడప వద్ద వాలిపోయే సేవల వైపు నగరవాసులు మొగ్గుచూపుతున్నారు. దేవుడి గదిలో కోట్లు విలువ చేసే బంగారం.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆశ మధ్యతరగతి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే కోరిక ఏది నిజమో.. ఏది అబద్ధమో.. ఏది మోసమో కూడా తెలుసుకోలేనంత వెర్రివాళ్లను చేస్తోంది. కోడిగుడ్డు రైతులకు గడ్డు కాలం..రాష్ట్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతోంటే.. కోడిగుడ్డ ధర మాత్రం నేలవైపు చూసత్ోందని లేయర్ ఫారాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రతకు చాలా వరకు కోళ్లు చనిపోతున్నాయని.. బతికున్న కోళ్లేమో బరువు సరిగ్గా పెరగడం లేదని వాపోతున్నారు.టీ విషయంలో గొడవ.. దాబా ధ్వంసం చాయ్ రేటు విషయంలో తలెత్తిన వివాదం హింసాత్మక ఘర్షణకు దారితీసింది. రాళ్లు రువ్వుకునే స్థాయికి చేరింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగావ్ ప్రాంతంలో జరిగింది. దుర్గ్- రాజనందగావ్ హైవేపై ఉన్న దాబా వద్దకు ఆదివారం ఉదయం కొందరు యువకులు వచ్చారు. వీరంతా ఒకే వర్గానికి చెందినవారని తెలుస్తోంది. టీ తాగిన తర్వాత దాబా యజమానితో యువకులు గొడవ పెట్టుకున్నారు. బ్రిటిషర్లను చిత్తు చేసిన భారత పహిల్వాన్!బుద్ధికుశలతలోనే కాదు.. శారీరకంగా కూడా భారతీయులకంటే తాము బలీయులమని విర్రవీగేవారు ఆంగ్లేయులు. సౌష్ఠవంలో, దేహదారుఢ్యంలోనూ తమ యూరోపియన్ల ముందు భారతీయులు బలాదూర్‌లని నమ్మేవారు. మనల్ని నమ్మించే ప్రయత్నం చేసేవారు. కానీ మన గామా పహిల్వాన్ దెబ్బకు అవన్నీ పటాపంచలైపోయాయ్! ఐరోపా బలం భళ్లున బద్ధలైంది.ఆశా వర్కర్లకు అరుదైన గౌరవం... భారతీయ మహిళా ఆశా వర్కర్లను డబ్ల్యూహెచ్ఓ సత్కరించింది. పది లక్షల మందికి పైగా మహిళా వలంటీర్లను గ్లోబల్ హెల్త్ లీడర్ అవార్డుతో సత్కరించింది.భారత్‌పై దృష్టి సారించిన యాపిల్!ప్రముఖ సంస్థ యాపిల్ భారత్‌లో తమ తయారీ ప్లాంట్లను నెలకొల్పే యోచనలో ఉన్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. కరోనా కట్టడి నిమిత్తం చైనాలో విధించిన లాక్డౌన్ వల్ల తమ కార్యకలపాలు దెబ్బతినడమే కారణంగా భావిస్తున్నట్లు పేర్కొంది.కెప్టెన్‌గా రిషభ్ పంత్ సరైన ప్రత్యామ్నాయం: పాంటింగ్ కెప్టెన్‌గా రిషభ్ కెప్టెన్సీపై దిల్లీ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ స్పందించారు. పంత్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడని, కెప్టెన్‌గా అతడే సరైన ప్రత్యామ్నాయమన్నారు.ఈ అగ్ర హీరోల సినిమాలు ఎప్పుడు? బాలీవుడ్ దశ తిరిగేనా?కరోనా తర్వాత బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటోంది. ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేలేకపోయింది. ఒకరకంగా చెప్పాలంటే.. సౌత్ నుంచి డబ్ అయిన సినిమాలే హిందీ పరిశ్రమను ఏలుతున్నాయి. ఉత్తరాది ప్రేక్షకులకు బాలీవుడ్ సినిమాపై ఆశలు సన్నగిల్లే పరిస్థితి ఏర్పడింది.