రాష్ట్రంలో కొత్తగా 952 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 2,58,828కు చేరింది. వీరిలో 1,410 మంది మృతిచెందారు.
రాష్ట్రంలో కొత్తగా 952 కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి
రాష్ట్రంలో కరోనా పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో కొత్తగా 952 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 13,732 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 952 కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి
మరో 1,602 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా... మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 2,43,686కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,732 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా... హోం ఐసోలేషన్‌లో 11,313 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 150 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 77, రంగారెడ్డి జిల్లాలో 68 మందికి వైరస్ నిర్ధరణ అయింది.
ఇదీ చూడండి:కరోనా మహమ్మారికి నేటితో ఏడాది పూర్తి!