తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2020, 8:45 AM IST

ETV Bharat / state

గ్రేటర్​లో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. 8 సర్కిళ్లలో అప్రమత్తత

రాష్ట్ర రాజధానిలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం 926 కేసులు నమోదయ్యాయి. పరీక్షలు పెరిగాయి. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న డివిజన్లు లేదా బస్తీలు, కాలనీలను గుర్తించాలని అధికారులకు కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ సర్కిల్‌ సూచించారు. వ్యాప్తి ఎక్కువగా ఉండే 10-20 ప్రాంతాలను ఎంపిక చేసి వైరస్‌ను కట్టడి చేయాలన్నారు. ఆయా సర్కిళ్లకు కేంద్ర కార్యాలయంలోని ఓ జాయింట్‌ కమిషనర్‌ను, ఏడుగురు అదనపు కమిషనర్లను నోడల్‌ అధికారులుగా నియమించారు.

coronavirus
coronavirus

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కొవిడ్‌ పరీక్షలు ఊపందుకున్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, ఇతర కేంద్రాల్లో పరీక్షలకు జనం తరలివచ్చారు. సోమవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 926, రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్‌లో 53 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అంబర్‌పేట సర్కిల్‌లో కొత్తగా 9 మంది కరోనా బారినపడ్డారు. విద్యానగర్‌లోని ఓ కాలనీకి చెందిన న్యాయవాది గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. తిలక్‌నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 82 మందికి పరీక్షలు నిర్వహించగా 27 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది.

ఫీవరాసుపత్రిలో 340 మందికి పరీక్షలు

బాలానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. కూకట్‌పల్లి, మూసాపేట, పర్వత్‌నగర్‌, ఎల్లమ్మబండ, హస్మత్‌పేట, హనుమాన్‌నగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 202 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేపడితే 40మందికి వైరస్‌ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో 37 కేసులు నమోదయ్యాయి. సరిపడా కిట్‌లు లేక షాపూర్‌నగర్‌ పట్టణ ఆరోగ్యకేంద్రంలో సోమవారం పరీక్షలు నిలిపివేశారు. మంగళవారం నుంచి చేస్తామని వైద్యులు తెలిపారు. దుండిగల్‌ ఆరోగ్యకేంద్రంలో 101 మందికిగాను 17మందికి కరోనా వచ్చింది. ఫీవరాసుపత్రిలో 340 మందికి పరీక్షలు చేశామని వైద్యులు తెలిపారు.

తీవ్రత ఎక్కువగా ఉన్నచోట

ఇప్పటివరకు 500కు పైగా కేసులు నమోదైన 8 సర్కిళ్లను బల్దియా పరిగణనలోకి తీసుకుంది. తీవ్రత అధికంగా ఉన్న డివిజన్లు లేదా బస్తీలు, కాలనీలను గుర్తించాలని అధికారులకు కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ సర్కిల్‌ సూచించారు. వ్యాప్తి ఎక్కువగా ఉండే 10-20 ప్రాంతాలను ఎంపిక చేసి వైరస్‌ను కట్టడి చేయాలన్నారు. ఆయా సర్కిళ్లకు కేంద్ర కార్యాలయంలోని ఓ జాయింట్‌ కమిషనర్‌ను, ఏడుగురు అదనపు కమిషనర్లను నోడల్‌ అధికారులుగా నియమించారు. మెహిదీపట్నం సర్కిల్‌కు జె.శంకరయ్య, చాంద్రాయణగుట్టకు విజయలక్ష్మి, చార్మినార్‌కు రాహుల్‌రాజ్‌, కుత్బుల్లాపూర్‌కు ప్రియాంక, రాజేంద్రనగర్‌కు సంతోష్‌, అంబర్‌పేటకు జయరాజ్‌కెనడీ, కార్వాన్‌కు జేసీ సంధ్యను నియమించారు. ఉపకమిషనర్లతో సమన్వయం చేసుకోవాలని, ప్రజల్లో భరోసా నింపే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో 36,221కి చేరిన కరోనా బాధితులు..

ABOUT THE AUTHOR

...view details