హైదరాబాద్ పాతబస్తీలో భారీ మోసం బయటపడింది. అధిక వడ్డీ ఆశ చూపి సుమారు 100 మంది నుంచి రూ. 9 కోట్లు వసూలు చేసి ఓ జంట ఉడాయించింది. బాధితుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. డబీర్‌పురాకు చెందిన సిస్టర్ బుశ్రా, ఆమె భర్త సిరాజ్ రహ్మాన్ యూఐఆర్‌సీ అనే సొసైటీ స్థాపించారు. ఎంత డబ్బు పెట్టుబడి పెడితే.. తక్కువ వ్యవధిలోనే రెట్టింపు ఇస్తామని నమ్మబలికారు. ఒక్కొక్కరు సుమారు రూ. లక్ష నుంచి 90 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. సుమారు వంద మంది బాధితుల నుంచి రూ. 9 కోట్ల వరకు వసూలు చేశారు. బాధితుల్లో సైదాబాద్, మలక్‌పేట, డబీర్‌పురా ప్రాంతాలకు చెందిన వారున్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాతబస్తీలో భారీ మోసం.. రూ. 9 కోట్లతో ఉడాయింపు - పాతబస్తీ
హీరా గ్రూప్స్ మోసం నుంచి తేరుకోక ముందే భాగ్యనగరంలో మరో భారీ స్కామ్ బయటపడింది. అధిక వడ్డీ ఆశ చూపి రూ. 9 కోట్లు వసూలు చేసి బాధితులకు ఎగనామం పెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
రూ. 9 కోట్లతో ఉడాయింపు