రాష్ట్రంపై కరోనా పంజా... కొత్తగా 879 కేసులు నమోదు - రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు
20:44 June 23
రాష్ట్రంపై కరోనా పంజా... కొత్తగా 879 కేసులు నమోదు
రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కొత్తగా 879 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 9,553కు చేరింది. తాజాగా మూడు మరణాలు సంభవించగా... ఇప్పటివరకు కరోనాతో 220 మంది మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 4,224 మంది డిశ్చార్జయ్యారు. ఆస్పత్రుల్లో 5,109 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో మరో 652 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో కొత్తగా 112 కొవిడ్ కేసులు వెలుగుచూడగా... రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 64 కేసులు బయటపడ్డాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 10, వరంగల్ అర్బన్ జిల్లాలో 9, జనగామ జిల్లాలో 7, నాగర్‌కర్నూల్ జిల్లాలో 4, సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2, మెదక్ జిల్లాలో కొత్తగా ఒక కరోనా కేసు నమోదయ్యాయి.
ఇవీ చూడండి:గాంధీలో 10,205 మందికి కొవిడ్ పరీక్షలు... కేసులు ఎన్నంటే?