తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైదరాబాద్​లో 130 కిలోల గంజాయి స్వాధీనం' - police arrested

అక్రమంగా తరలిస్తున్న 130 కిలోల గంజాయిని హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్​లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై కేసులు నమోదు చేశారు. ఇద్దరు మహిళలతో సహా మరో ముగ్గురు పరారీలో ఉన్నారని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు.

గంజాయి పట్టివేత

By

Published : May 17, 2019, 5:25 AM IST

Updated : May 17, 2019, 7:37 AM IST

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న 130 కిలోల గంజాయిని రాజేంద్రనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్​కు వస్తున్న ఇండికా కారులో 40 కిలోలు స్వాధీనం చేసుకుని 9 మందిపై కేసు నమోదు చేశారు. ఆరుగురిని రిమాండుకు తరలించారు. ఇద్దరు మహిళలతో సహా మరో ముగ్గురు పరారీలో ఉన్నారని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. కాటేదాన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో చిన్న ప్యాకెట్లుగా గంజాయి మారుస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని మరో 90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Last Updated : May 17, 2019, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details