ఏపీ కరోనా కేసుల్లో రోజూ రికార్డులే...! ఇవాళ ఎన్నంటే...? - corona cases status in ap
17:44 July 24
ఏపీ కరోనా కేసుల్లో రోజూ రికార్డులే...! ఇవాళ ఎన్నంటే...?
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 8,147 కరోనా కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 80,858కి చేరింది. ఏపీలో కరోనాతో మరో 49 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 933కు పెరిగింది.
ఆస్పత్రుల్లో 39,990 మంది చికిత్స పొందుతుండగా.. 39,935 మంది మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకూ 15,41,993 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.