హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్ కొనసాగుతుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 75 వేల మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారన్న కేంద్ర మంత్రి.. దీనిపై తెరాస, మజ్లిస్‌లు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లింలను రాజకీయ లబ్దికోసం కాపాడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదుచేస్తే..
పాతబస్తీలో రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించినట్లు చెబుతున్నారని.. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు ఇచ్చారని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే రోహింగ్యాలపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.