తెలంగాణలో తాజాగా 623 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,43,716కు చేరింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,796కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 746 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,30,732కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,188 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 97.98 శాతంగా నమోదైంది. ఇవాళ 1,11,947 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,06,462 పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో చేయగా మిగతా 5,485 టెస్టులు ప్రైవేట్లో నిర్వహించారు.
జాగ్రత్తలు పాటించాలి
18 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు కూడా తప్పకుండా తీసుకోవాలని కోరుతున్నారు. మూడో వేవ్ వచ్చే అవకాశం ఉండటంతో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. లక్షణాలు ఉంటే తప్పకుండా కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.