తెలంగాణ

telangana

ETV Bharat / state

5PM TOPNEWS@5PM టాప్​న్యూస్ - 5PM TOPNEWS

ఇప్పటివరకున్న ప్రధానవార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Apr 22, 2022, 4:58 PM IST

  • భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. టార్గెట్ మోదీ​!

జమ్ముకశ్మీర్​లో ప్రధాని మోదీ పర్యటనే లక్ష్యంగా ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన ఆత్మాహుతి దళంలోని ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి.

  • ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

విద్యార్థినిపై దాడి కేసులో ప్రేమోన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నిందితుడు హనుమకొండలో బాధితురాలు అనూష గొంతు కోసి హత్య చేసేందుకు యత్నించాడు.

  • మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో కేంద్ర, రాష్ట్ర హోంశాఖలు, ఖమ్మం సీపీ, త్రీటౌన్‌ ఎస్‌హెచ్‌వో, సీబీఐకి కూడా నోటీసులిచ్చింది. ఖమ్మం తెరాస నేత ప్రసన్నకృష్ణ, సీఐ సర్వయ్యకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

  • 'రేవంత్‌ ఎక్కడున్నా ఆ పార్టీ నాశనం'

రేవంత్​ రెడ్డి చంద్రబాబు ఏజెంట్​లా పనిచేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ఆరోపించారు. రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ పార్టీ నాశనమవుతుందని ఆయన విమర్శించారు.

  • ఫుడింగ్​ పబ్​ కేసు.. మరో ఇద్దరిని ప్రశ్నిస్తున్న పోలీసులు

పుడింగ్‌ పబ్‌ కేసులో బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరిని వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు.

  • ట్రైన్​కు బ్రేకు.. అరగంటలో సర్వం దోపిడీ

చోరీలకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది ఓ దొంగల గుంపు. ఇళ్లలో కాకుండా రైలులో చోరీకి పాల్పడింది. చోరీకి అంబులెన్స్​ను వాహనంగా మార్చుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

  • కారుకు హెలికాప్టర్​ లుక్..

పాత వ్యాగన్​ ఆర్​ కారును హెలికాప్టర్​లా మార్చేశాడు బిహార్ ఖగడియాకు చెందిన దివాకర్ కుమార్. యూట్యూబ్ వీడియోలు చూసి, రూ.3.5లక్షలు ఖర్చు చేసి వాహనం మొత్తాన్ని ఇలా రీడిజైన్ చేయించాడు.

  • సింహం ఎక్కడైనా సింహమే!

ఎంఎస్‌ ధోనీ.. క్రికెట్‌ ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్‌. ఎంత ఒత్తిడి ఉన్నా కూల్‌గా షాట్లు బాది తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించడంలో తనకు తానే సాటి. గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు.

  • 'కేజీఎఫ్-​2'పై బన్నీ కామెంట్స్

బాక్సాఫీస్​ను షేక్​ చేసిన 'కేజీఎఫ్​2' చిత్రంపై అల్లుఅర్జున్​ ప్రశంసల వర్షం కురిపించారు. 'కేజీఎఫ్‌-2 సినిమా యూనిట్‌కు అభినంద‌న‌లు. ఈ సినిమాలో య‌శ్ న‌ట‌న అద్భుతం. సంజ‌య్ ద‌త్, రవీనా టాండన్, శ్రీ‌నిధి శెట్టి పాత్రలు అంద‌రినీ ఆకర్షించేలా ఉన్నాయని ట్వీట్​ చేశారు అల్లుఅర్జున్​.

  • శత్రు దేశాల అధినేతల 'ప్రేమ లేఖలు'- అసలు లక్ష్యం అదేనా?

బద్ధ శత్రు దేశాలైన ఉత్తర కొరియా- దక్షిణ కొరియా మధ్య ఊహించని పరిణామం జరిగింది. ఇరు దేశాధినేతలు పరస్పరం లేఖలు రాసుకున్నారు. ముఖ్యంగా దైపాక్షిక సంబంధాల గురించి ప్రస్తావన వచ్చినట్లు అక్కడి అధికారిక మీడియాలు వెల్లడించాయి.

ABOUT THE AUTHOR

...view details