తెలంగాణ

telangana

ETV Bharat / state

నుమాయిష్​కు రోజుకు 50 వేల సందర్శకులు..: సీపీ - అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన

నాంపల్లి ఎగ్జిబిషన్​లో ఏర్పాటైన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ఈరోజు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పోలీస్ స్టాల్​ను ఆరంభించారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

50 thousand tourists a day strong security CP Anjani kumar
రోజుకు 50 వేల పర్యాటకులు.. పటిష్ట భద్రత : సీపీ అంజనీ

By

Published : Jan 10, 2020, 5:31 PM IST

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్​లో జరుగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్.. పోలీస్ స్టాల్ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్​ఘడ్ తదితర రాష్ట్రాల నుంచి రోజుకు సుమారు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారని అన్నారు.

నగర పోలీసు శాఖ తరపున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. షి-టీమ్, ట్రాఫిక్ పోలీసు, ఎగ్జిబిషన్ తదితర శాఖల సహాయంతో సీసీటీవీ పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఆ స్టాల్లో ఏర్పాటు చేసిన పలు సూచనల బోర్డులను సీపీ పరిశీలించారు. ట్రాలీ రైల్లో కూర్చొని స్టాళ్లను గమనించారు.

రోజుకు 50 వేలు పర్యాటకులు.. పటిష్ట భద్రత : సీపీ అంజనీ

ఇదీ చూడండి : 'ఒలంపిక్స్​లో భారత్ అత్యధిక పతకాలు సాధిస్తుంది'

ABOUT THE AUTHOR

...view details