కష్టపడకుండా ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ యువకుడు ఒకటి కాదు... రెండు కాదు... దాదాపుగా కోట్ల రూపాయలను దండుకుని కటకటాలపాలైనాడు. చింతల్‌కు చెందిన రాజేశ్వరి వద్ద 25 లక్షలు వసూలు చేసి కనిపించకుండా వెళ్లిపోయాడు. రాజేశ్వరి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మహేష్‌తో పోటు ఆయన తల్లి లింగమ్మను కూడా అరెస్టు చేసినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. మహేష్ అమాయక ప్రజలను, కొత్తగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లతో సన్నిహితంగా ఉంటూ ...వారిని నమ్మించి దాదాపు 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడని అనుమానిస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని కస్టడీకి తీసుకుని మరోసారి విచారిస్తామన్నారు. మహేష్ సోదరుడు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.
కొత్త వ్యాపారమంటూ 5కోట్ల రూపాయల మోసం..! - Easy Money
అమాయక ప్రజలను, కొత్తగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లతో సన్నిహితంగా ఉంటూ.. వారిని నమ్మించి కోట్ల రూపాయలు దండుకున్న ఓ యువకుడు కటకటాలపాలైనాడు.
Easy Money
ఇవీ చూడండి:భవిష్యత్తులో మరింత సాధించాలి: మహేశ్ భగవత్
Last Updated : Aug 27, 2019, 12:57 PM IST