తెలంగాణ రాష్ట్రంలో శిక్షణలో ఉన్న 2018 సంవత్సరానికి చెందిన ఐఏఎస్ అధికారులు సింగరేణి సంస్థను సందర్శించారు. ప్రస్తుతం వీరు వివిధ జిల్లాల్లో అసిస్టెంట్ కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ సంస్థ ఛైర్మన్ ఎన్. శ్రీధర్తో సమావేశమయ్యారు.
సింగరేణి విజయాలకు సమష్టి కృషే ప్రధానకారణం - సింగరేణి విజయాలకు సమష్టి కృషే ప్రధానకారణం
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ రాష్ట్రంలోనే కాక దేశంలోని మహారత్న కంపెనీలకు సమానంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు కార్మికుల కృషి కూడా ప్రధాన కారణమని ఛైర్మన్ ఎన్. శ్రీధర్ వెల్లడించారు. శిక్షణలో ఉన్న 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారులతో సింగరేణి భవన్‌లో జరిగిన సమావేశంలో వివరించారు.
సింగరేణి విజయాలకు సమష్టి కృషే ప్రధానకారణం
గత ఐదేళ్ల కాలంలో సంస్థ సాధించిన విజయాలను శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులకు స్ఫూర్తిదాయకంగా ఛైర్మన్ ఎన్. శ్రీధర్ వివరించారు. కార్మికులు, అధికారులు సమష్టిగా కృషి చేస్తూ ప్రతీ ఏటా ఇచ్చిన లక్ష్యాలు సాధిస్తూ వస్తున్నారని వివరించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు అంకితభావంతో కృషిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సోదాహరణంగా వివరించారు.
ఇవీచూడండి:'12లక్షల సభ్యత్వాలే భాజపా లక్ష్యం..!'