తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ గుర్తింపు కార్డు జారీ చేసిన అధికారులపై వేటు - DUPLICATE VOTER ID CARDS

ఎన్నికల సంఘాన్ని అపవాదు చేయడానికి ఎవరో ఆకతాయిలు ఎన్నికల సంఘం అధికారుల పేర్లపై నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు ధరఖాస్తు చేశారు. అధికారులు చూసుకోకుండానే గుర్తింపు కార్డులు జారీ చేశారు. అధికారుల చేసిన తప్పిదానికి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.

DANA KISHORE

By

Published : Feb 2, 2019, 3:12 AM IST

Updated : Feb 4, 2019, 5:50 PM IST

SUSPENDED
ఓటర్ల దరఖాస్తులను సరిగ్గా తనిఖీ చేయకుండా కార్డులిచ్చిన అధికారులపై జీహెచ్ఎంసీ వేటు వేసింది. నాంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల అధికారుల పేర్లతో ఓటరు గుర్తింపు కార్డు నమోదు చేసిన మ‌హ్మద్ ఖ‌లీలుద్దీన్‌ను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ కమిష‌న‌ర్ ఎం.కె.ఐ.అలీ, జూనియ‌ర్ అసిస్టెంట్ షేక్ హుస్సేన్‌ల‌కు మెమోలు ఇచ్చారు. అభ్యంతరాలు పరిశీలించకుండా గుర్తింపు కార్డులు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దాన కిషోర్ హెచ్చరించారు.
Last Updated : Feb 4, 2019, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details