తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1,924 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 29,536కి చేరింది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
తెలంగాణలో కొత్తగా 1924 మందికి కరోనా పాజిటివ్ - తెలంగాణ కరోనా కేసులు
15:03 July 08
తెలంగాణలో కొత్తగా 1924 మందికి కరోనా పాజిటివ్
ప్రస్తుతం రాష్ట్రంలో 11,933 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. బుధవారం 992 మంది డిశ్ఛార్జి కాగా, ఇప్పటివరకు 17,279 మంది కోలుకున్నారు. బుధవారం చనిపోయిన 11 మందితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 324కు చేరింది.
జీహెచ్ఎంసీపై కరోనా పంజా..
బుధవారం 6,363 శాంపిల్స్‌ను పరీక్షించగా... ఇప్పటివరకు 1,34,801 టెస్టులు జరిగాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,590 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 99 నమోదుకాగా, మేడ్చల్ నుంచి 43 వచ్చాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో 26, సంగారెడ్డిలో 20 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇవీ చూడండి: జీవితం, జీవనోపాధి రెండూ ముఖ్యమే: మంత్రి కేటీఆర్