మొదటి రోజు ఉద్యోగ నియామకాల్లో 1,383 మంది మేనేజ్ మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని ప్రపంచ ప్రఖ్యాత ఇండియన్ స్కూల్ ఆఫ్ జిబినెస్(ఐఎస్బీ) ప్రకటించింది. క్రితం ఏడాది మొదటి రోజు కేవలం 1,194 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని... ప్రస్తుత సంఖ్య ఇప్పటివరకు నమోదైన మొదటి రోజు ఉద్యోగాల సంఖ్యలో అత్యధికమని తెలిపింది.
ఉద్యోగాలు సాధించిన 1,383 మంది ఐఎస్బీ విద్యార్థులు - campus selections
ఈ ఏడాది అధిక సంఖ్యలో మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని ప్రఖ్యాత ఇండియన్ స్కూల్ ఆఫ్ జిబినెస్(ఐఎస్బీ) ప్రకటించింది.
ఉద్యోగాలు సాధించిన 1383 మంది ఐఎస్బీ విద్యార్థులు
ఉద్యోగాలు పొందిన వారి సరాసరి వేతనం రూ.26.15 లక్షలుగా ఉందని... ఐఎస్బీకి రాకముందు చేస్తున్న ఉద్యోగ వేతనంతో పోల్చితే 124 శాతం ఎక్కువని వెల్లడించింది. మొత్తం 231 కంపెనీలు ప్లేస్మెంట్స్ నిర్వహించాయని, ఇందులో 65 కంపెనీలు మొదటి సారి ఐఎస్బీ నుంచి ఉద్యోగులను ఎంపికచేసుకున్నాయని ప్రకటించింది. ఐఎస్బీకి హైదరాబాద్, మొహాలీలో క్యాంపస్లు ఉన్నాయి.
ఇవీ చూడండి: రైల్వే అప్రెంటిస్‌షిప్‌లో తెలుగువారికి అన్యాయం