రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,23,005 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,362 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. తాజాగా 10 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,12,196కి చేరింది.
Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 1,362 కరోనా కేసులు, 10 మరణాలు - కరోనా లాక్డౌన్ తొలగింపు
18:33 June 19
కరోనాతో మరో పదిమంది మృతి
తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 3,556 మంది మహమ్మారికి బలయ్యారు. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1,813 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 5,90,072 మంది బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,568 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖ 1,74,37,785 నమూనాలను పరీక్షించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యారోగ్యశాఖ నివేదిక ఇచ్చింది. దీనిని పరిశీలించిన మంత్రివర్గం వైద్యారోగ్యశాఖ నివేదిక ఆధారంగా తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలన్నీ ఎత్తివేసింది. ఈ మేరకు అధికారులకు మంత్రివర్గం ఆదేశాలు జారీ చేసింది. సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొనసాగించాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:TS UNLOCK: తెలంగాణ అన్లాక్.. ఇవన్నీ ఓపెన్