తెలంగాణ

telangana

ETV Bharat / state

13 మంది గర్భిణులకు హోం క్వారంటైన్.. ఎందుకంటే?

ఈస్ట్ మారేడ్​పల్లిలోని సమీప బస్తీల్లో 13 మంది గర్భిణీలను అధికారులు హోమ్ క్వారంటైన్​ చేశారు. ఎందుకంటే..

By

Published : May 1, 2020, 11:41 AM IST

13 Pregnant womens  Home Quarantine at east maredpalli
13 మంది గర్భిణీలు హోం క్వారంటైన్.. ఎందుకంటే?

హైదరాబాద్​ ఈస్ట్ మారేడ్​పల్లిలోని సమీప బస్తీల్లో 13 మంది గర్భిణీలను హోమ్ క్వారంటైన్​లో ఉండాల్సిందిగా వైద్యులు, జీహెచ్​ఎంసీ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు వారందరికీ హోం క్వారంటైన్​ ముద్రలు వేశారు. ఫలితంగా బస్తీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

గత నెల 24న 13 మంది గర్భిణీలు 102 వాహనంలో కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వెళ్లారు. స్టాండింగ్ నిర్వహించిన అనంతరం తిరిగి వారిని బస్తీల్లో వదిలివెళ్లారు. ఈ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్​కు తరచుగా దగ్గు, వాంతులు రావడం వల్ల అనుమానం వచ్చి గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేయగా అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఫలితంగా వాహనంలో ప్రయాణించిన 13 మంది గర్భిణీ మహిళలను హోమ్ క్వారంటైన్​ ఉండవలసిందిగా ఆదేశిస్తూ స్టాంపులు వేశారు.

ఇదీ చూడండి:స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు

ABOUT THE AUTHOR

...view details