తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్క రోజే 11.5 లక్షల మంది రైలు ప్రయాణం - ఒక్క రోజే 11.5 లక్షల మంది రైలు ప్రయాణం

దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో మొదటిసారిగా ఒకేరోజు 11.5 లక్షల మంది అన్ రిజర్వ్​డ్ ప్రయాణికులను రవాణా చేసింది. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో నగర వాసులంతా రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుండడం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.

ఒక్క రోజే 11.5 లక్షల మంది రైలు ప్రయాణం

By

Published : Oct 23, 2019, 5:37 AM IST

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఉరుకులు పరుగులుగా ఉండే నగర వాసులు ప్రయాణానికి రైళ్లు ఆశ్రయిస్తున్నారు. సమ్మె మొదలైనప్పటి నుంచి ఎంఎంటీఎస్​తో పాటు మెట్రో రైళ్లలో రద్దీ భారీగా పెరిగింది. ఈనెల 21 నుంచి విద్యాలయాలు పున:ప్రారంభమైన నేపథ్యంలో రద్దీ మరింతగా పెరిగింది. ఆ ఒక్కరోజే 11.5 లక్షల మంది అన్​రిజర్వ్​డ్​ ప్రయాణికులను రవాణా చేసింది.

ఎంఎంటీస్​కు ప్రయాణికుల తాకిడి

సాధారణ రోజుల్లో ఎంఎంటీఎస్​ రైళ్లలో 1.60 వేల మంది.... ఇతర రైళ్లలో 7.60 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. కానీ ఈనెల 21న ఎంఎటీస్​లో 2.30 లక్షల మంది...ఇతర రైళ్లలో 9.20 లక్షల మంది ప్రయాణించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇంటర్​సిటీ రైళ్లకు అదనపు బోగీలు

పరిస్థితిని ముందుగానే ఊహించిన దక్షిణ మధ్య రైల్వే... కాచిగూడ-నిజామాబాద్, కాచిగూడ-కర్నూల్ సిటీ స్టేషన్ల మధ్య 4 ప్రత్యేక జన్ సాధారణ్ రైళ్లను నడిపింది. రోజువారీ ఇంటర్ సిటీ ఎక్స్​ప్రెస్ రైళ్లకు 14 అదనపు కోచ్​లను జతచేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. రాబోయే రోజుల్లో కూడా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రైల్వేశాఖ జీఎం గజానన్ మాల్యా అధికారులకు సూచించారు.

ఒక్క రోజే 11.5 లక్షల మంది రైలు ప్రయాణం

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె ప్రభావంతో కిటకిటలాడుతున్న మెట్రో...

ABOUT THE AUTHOR

...view details