రాష్ట్రంలో దాదాపు మూడో వంతు పాలిటెక్నిక్ సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 202 సీట్లు భర్తీ కాలేదు. పాలిటెక్నిక్ అభ్యర్థులకు శనివారం తుది విడతలో 3 వేల 69 సీట్లు కేటాయించారు.
రాష్ట్రవ్యాప్తంగా 132 కాలేజీల్లో 31 వేల 792 సీట్లు ఉండగా.. రెండు విడతల్లో కలిపి 67.91 శాతం.. 21 వేల 590 సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో 40 ప్రభుత్వ, ఆరు ప్రైవేట్ కాలేజీల్లో సీట్లన్నీ నిండాయి. ప్రైవేట్ కాలేజీల్లో 9 వేల 556, ప్రభుత్వ కళాశాలల్లో 616 సీట్లు మిగిలాయి.